Saturday, 12 September 2026 04:50:59 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా సిరిసిల్ల బ్రిడ్జిపై యువజన కాంగ్రెస్ బైఠాయింపు:

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

Date : 27 June 2026 02:11 PM Views : 329

వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : సిరిసిల్ల: నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా,"ఛాత్రోం కీ గూంజ్" పేరిట యువజన కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో నాయకులు సిరిసిల్ల బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కౌడగాని వెంకటేష్ మాట్లాడుతూ.నీట్ లీకేజీ వల్ల మనస్తాపంతో 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వం తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 80కి పైగా పేపర్లు లీక్ అయ్యాయని, కేంద్ర మంత్రి రాజీనామా చేయకుంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధులు గుడిసె ప్రభాకర్, రెడ్డిమల్ల భాను, నియోజకవర్గ అధ్యక్షులు చుక్క రాజశేఖర్, న్యాత నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగం మురళి, శేఖర్ శౌర్య నాయక్, ఎడ్ల తిరుపతి మరియు పలువురు మండల, టౌన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

S PRADEEP

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :