వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: పట్టణంలోని పోస్టాఫీస్ నుంచి పాలచెట్టు వరకు రహదారిపై వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్యను మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆదేశాల మేరకు సింగరేణి మందమర్రి ఏరియా అధికారులు వీధి దీపాలను ఏర్పాటు చేయించారు.దీంతో రాత్రివేళల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బం దులు తొలగనున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమలరెడ్డి మంత్రి, సింగరేణి జీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం