Sunday, 13 September 2026 07:33:04 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

టిజిఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో డ్రైవర్లకు పోలీస్ రక్షణ

ఎస్పీ నితిక పంత్

Date : 22 April 2026 08:08 PM Views : 150

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టిజిఆర్‌టిసి జెఎసి సమ్మె నేపథ్యంలో జిల్లాలో బస్సు సర్వీసులు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున ప్రైవేట్ హైర్డ్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక డ్రైవర్లకు పూర్తి పోలీస్ రక్షణ కల్పిస్తామని ఎస్పీ నితిక పంత్ స్పష్టం చేశారు.డ్రైవర్లు ఎలాంటి భయానికి గురికావాల్సిన అవసరం లేదని, వారి భద్రత కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ముఖ్య కూడళ్లు, బస్‌స్టాండ్లు, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ బలగాలను మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే స్పందించేందుకు మొబైల్ పెట్రోలింగ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.బస్సు సర్వీసులకు అడ్డుకట్ట వేయడం, డ్రైవర్లను బెదిరించడం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :