వాస్తవ గమ్యం / తెలంగాణ / హైద్రాబాద్ : కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.సీఎం ఆదేశాల మేరకు సీఎస్ గవర్నర్ లోక్‌భవన్‌కు లేఖ పంపినట్లు తెలుస్తోంది.దీనిపై గవర్నర్ కాసేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇదే సమయంలో ప్రభుత్వం కీలక పదవుల్లో మార్పులు చేపట్టింది. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమించింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
Reporter
వాస్తవ గమ్యం