Sunday, 13 September 2026 07:33:49 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ప్రజల చెంతకే పోలీస్ నేరరహిత సమాజమే లక్ష్యంగా ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

2000 లీటర్ల బెల్లపు పానకం ధ్వంసం, 37 వాహనాలు సీజ్

Date : 09 April 2026 09:38 AM Views : 478

వాస్తవ గమ్యం / తెలంగాణ / : ​మంచిర్యాల జిల్లా (కోటపల్లి) నేరాలనిర్మూలనమరియుప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ను ముమ్మరం చేశారు.ఇందులో భాగంగా గురువారం తెల్లవారు జామున కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు నేతృత్వంలో సుమారు 50 మంది పోలీసులతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.​గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాలపై దాడులు నిర్వహించిన పోలీసులు, భారీగా నిల్వ ఉంచిన సుమారు 2000 లీటర్ల బెల్లపు పానకాన్ని గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే 70 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, అక్రమ తయారీ మరియు విక్రయాలకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.​​గ్రామంలో ఇంటింటినీ తనిఖీ చేసిన పోలీసులు, సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు,5ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయంతో పాటు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ​కొత్త వ్యక్తులు లేదా అనుమానితుల కదలికలపై నిఘా ఉంచాలని గ్రామస్తులను సూచించారు.మహిళలు, చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆపద సమయంలో 'డయల్ 100'ను ఆశ్రయించాలని తెలిపారు.నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ​ఈ ఆపరేషన్‌లో చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, రూరల్ సీఐ ఆర్.కృష్ణ, ఎస్సైలు సుబ్బారావు, రాజశేఖర్, జగదీశ్వర్ రెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :