Sunday, 13 September 2026 07:40:26 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

600 గ్రాముల చిన్నారికి పునర్జన్మ.. ఉచితంగా వైద్యం అందించిన మంచిర్యాల మల్లికార్జున హాస్పిటల్!

Date : 10 July 2026 01:16 PM Views : 78

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మంచిర్యాల:కేవలం 600 గ్రాముల బరువుతో, అత్యంత క్లిష్ట పరిస్థితిలో జన్మించిన ఒక నవజాత శిశువును మంచిర్యాలలోని మల్లికార్జున చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు ప్రాణాలతో కాపాడారు.దహేగాం మండలానికి చెందిన ఒక పేద దంపతులకు నెలలు నిండకుండానే కవల పిల్లలు జన్మించారు. అందులో ఒక పాప కేవలం 600 గ్రాముల బరువుతో ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో, లండన్ అనుభవజ్ఞుడైన పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీనివాస్ గోపతి ఆధ్వర్యంలో వెంటనే ఎన్‌ఐసీయూ లో చేర్చారు. వైద్య బృందం 40 రోజుల పాటు నిరంతరం శ్రమించి చికిత్స అందించడంతో పాప ప్రస్తుతం 1.100 కిలోల బరువుకు చేరుకుని, పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యింది.కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు రూ. 15 నుండి 20 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి మల్లికార్జున హాస్పిటల్ యాజమాన్యం రూపాయి తీసుకోకుండా పూర్తిగా ఉచితంగా అందించింది. తక్కువ బరువుతో పుట్టే పిల్లల కోసం హైదరాబాద్, కరీంనగర్ వెళ్లకుండా ఇకపై మంచిర్యాలలోనే ఇలాంటి అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :