Friday, 11 September 2026 02:46:35 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మత్తు పదార్థాల వినియోగం అక్రమ రవాణా పై పోలీసుల తనిఖీలు

Date : 11 August 2026 04:29 PM Views : 263

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లా భీమారం పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా భీమారం పట్టణ సమీపంలోని 63వ జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, కిరాణా దుకాణాలు, పాన్ షాపులతో పాటు అనుమానిత ప్రదేశాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.నాటుసారా, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలు మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు భీమారం ఎస్సై రాజేందర్ తెలిపారు. అనుమానిత ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించి నార్కోటిక్ డాగ్ సహాయంతో తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ, మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండాఅప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్‌కు బానిసై తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు.మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించి ఎక్కడైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజలు అందించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని భీమారం పోలీసులు విజ్ఞప్తి చేశారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :