Saturday, 12 September 2026 04:34:44 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

పవర్ గూడలో వ్యాక్సిన్ కార్యక్రమం 5 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి:

సర్పంచ్ తొడసం రాజేందర్

Date : 08 August 2026 12:38 PM Views : 61

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : జైనూర్ మండలం పవర్ గూడ 5 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని మండలంలోని పవర్ గూడ గ్రామ సర్పంచ్ తొడసం రాజేందర్ అన్నారు. శనివారం పవర్ గూడ గ్రామంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ తొడసం రాజేందర్ మాట్లాడుతూ.చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు ఎంతో ముఖ్యమని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రభుత్వం సూచించిన అన్ని వ్యాక్సిన్లను సకాలంలో వేయించాలని సూచించారు. పిల్లలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు వ్యాక్సిన్లు ఎంతగానో ఉపయోగ పడతాయని తెలిపారు.అదేవిధంగా గ్రామంలోని 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ అందేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ కార్యక్రమం ద్వారా చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్తులో వ్యాధుల బారిన పడకుండా ముందస్తు రక్షణ కల్పించవచ్చని అన్నారు.ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. గ్రామంలో ఏ చిన్నారికి కూడా వ్యాక్సిన్ మిస్ కాకుండా సంబంధిత ఆరోగ్య సిబ్బందితో కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్తులు మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :