Saturday, 12 September 2026 05:46:38 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

భారతదేశ చరిత్రను తిరగరాసేది బహుజన్ మాయావతి

దాగిళ్ళ దయానందరావు

Date : 11 July 2026 07:11 PM Views : 113

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో శనివారం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఈసీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్ జోన్-2 చీఫ్ జోనల్ ఇన్‌చార్జ్ దాగిళ్ల దయానందరావు ముఖ్య అతిథిగా, పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జ్ కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.సమావేశానికి ముందు పార్టీ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా దాగిళ్ల దయానందరావు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రను తిరగరాసేది బహన్ మాయావతి అని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణతో పాటు అణగారిన వర్గాల అభివృద్ధే బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2027లో ఉత్తరప్రదేశ్‌లో, 2028లో తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ మంచిర్యాల జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ జెండా ఎగురవేయాలని. పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టం చంద్రశేఖర్ బీఎస్పీలో చేరారు. ఆయనకు దాగిళ్ల. దయానందరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించి, మంచిర్యాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రకటించారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ల మురళి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిలు గోమాస బ్రహ్మానందం, గోలేటి నారాయణ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు బండారి రాజ్‌కుమార్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎండీ మాతిన్ ఖాన్, నస్పూర్ మండల అధ్యక్షుడు వేముల కిరణ్, నాయకులు జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: