Sunday, 13 September 2026 10:53:15 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.

భీమారం లంబడి తండాలో కార్డెన్ సర్చ్.

Date : 21 July 2026 07:27 PM Views : 313

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, ఆదేశాల మేరకు, డీసీపీ మంచిర్యాల ఎ. భాస్కర్, జైపూర్ ఏసీపీ ఎ. వెంకటేశ్వర్ సూచనలతో, జైపూర్ సీఐ కె. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో భీమారం గ్రామం లంబాడి తండాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులను విచారించడంతో పాటు ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వాహనాల తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్ లేని 45 వాహనాలను సీజ్ చేశారు. అలాగే ప్రభుత్వం నిషేధించిన గుడుంబాను స్వాధీనం చేసుకుని సంబంధిత కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా సీఐ కె. నవీన్ కుమార్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతరం నిఘా ఉంచి గంజాయి, మద్యం తదితర మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా చూడాలని సూచించారు. అలాగే యువత ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిస కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసైన వారిని డీ-అడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు.అదేవిధంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్ఐ భూమేష్, భీమారం ఎస్ఐ ఎ. రాజేందర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: