Monday, 26 October 2026 04:28:05 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

వైభవంగా మందమర్రి హరిహర క్షేత్ర గణనాథుడి నిమజ్జనం

రాయపట్నం గోదావరి తీరంలో గంగమ్మ ఒడికి చేరిన లంబోదరుడు

Date : 23 September 2026 03:15 PM Views : 207

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మందమర్రి: స్థానిక ప్రసిద్ధ శ్రీ హరిహర దేవస్థానంలో కొలువుదీరిన గణనాథుడి నిమజ్జనోత్సవం బుధవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ ముగిసింది. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడికి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు శాస్త్రోక్తంగా వీడ్కోలు పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన నిమజ్జన శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో కోలాహలంగా సాగింది. స్థానిక మార్కెట్ ఏరియా మీదుగా సాగిన ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యువకుల నృత్యాలు, డప్పు వాయిద్యాల చప్పుళ్ళు, "గణపతి బప్పా మోరియా.. అగలే బరస్ తూ జల్దీ ఆ" అంటూ భక్తులు చేసిన జయజయధ్వానాలతో మార్కెట్ వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మార్గమధ్యంలో స్థానిక వ్యాపారులు, మహిళలు స్వామివారికి హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు.​పురవీధుల్లో సాగిన శోభాయాత్ర అనంతరం వినాయక విగ్రహాన్ని రాయపట్నం గోదావరి తీరానికి తరలించారు. అక్కడ ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల సమక్షంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య గణపయ్యను ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :