వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ పరిధిలోని గర్మిళ్ల ప్రాంతంలో మల్లేష్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. అదే సమయంలో కారులో వెళ్తున్న వైద్య దంపతులు డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్, డాక్టర్ సునీత వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మల్లేష్‌ను కాపాడారు.సకాలంలో స్పందించి ప్రాణాన్ని నిలబెట్టిన వైద్య దంపతుల మానవత్వాన్ని పలువురు అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎంత కీలకమో తెలియజేసిన సంఘటనగా ఇది నిలిచింది. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు ముఖేష్ గౌడ్,.కస్తూరి నాగరాజు,బోట్ల అనిత–సత్యం వైద్య దంపతులను అభినందించి ఘనంగా సత్కరించారు.
Reporter
వాస్తవ గమ్యం