వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బెన మండలంలోని ఎన్‌టీఆర్ కాలనీలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెబ్బెన తహసీల్దార్ సూర్యప్రకాష్, సీఐ సంజయ్, ఎస్‌ఐ వెంకటకృష్ణ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అధికారులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో గణేష్ మండలి కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం