Friday, 11 September 2026 03:51:25 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

చెన్నూర్ లో ఉచిత నేత్ర వైద్య శిబిరం

60 మంది కి ఉచిత కంటి ఆపరేషన్లు.

Date : 20 July 2026 07:14 PM Views : 70

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : యశోద బాయి, కిషన్ లాహోటి స్మారకార్థముగా చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం ను నిర్వహించారు.సోమవారం నాడు చెన్నూరు లయన్స్ క్లబ్ కరీంనగర్ లోని రేకుర్తి ఉదార నేత్ర వైద్యశాల వారి సౌజన్యంతో, వైస్ చైర్మన్ లయన్ చిదురా సురేష్ సహకారంతో చెన్నూరు లోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో ఈ ఉచిత నేత్ర వైద్య శిభిరం నిర్వహించారు. ఇందులో 120 మందికి బి పి,షుగర్, కంటి పరీక్షలు నిర్వహించారు అందులో 60 మంది కంటి ఆపరేషన్ కోసం అర్హత సాధించినట్లు రేకుర్తి ప్రతినిధి ప్రభాకర్ మరియు చెన్నూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ నిమ్మల సాగర్ ప్రకటించారు.వీరిని రేకుర్తి ఆసుపత్రి కి తరలించారు.వీరికి కంటి ఆపరేషన్స్ నిర్వహించి బుధవారం నాడు వారిని వారి స్వస్థలాలకు పంపిస్తామని క్లబ్ అధ్యక్షులు లయన్ నిమ్మల సాగర్ తెలిపారు.చెన్నూరులో జరిగిన ఉచిత కంటి శిభిరం నిర్వహణ అయిన ఖర్చును చెన్నూరు ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ లాల్ లహోటి సోదరుడు డాక్టర్ ఓం లహోటి నానమ్మ యశోద బాయి,తాతయ్య కిషన్ లాహోటి గార్ల జ్ఞాపకార్థం సుమారు 15,000 రూపాయలు స్పాన్సర్ చేసినందుకు క్లబ్ అధ్యక్షులు లయన్ నిమ్మల సాగర్ మరియు జోన్ చైర్ పర్సన్ లయన్ జాడి తిరుపతి ప్రత్యేకంగా హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో చెన్నూర్ ప్రముఖ వైద్యులు శంకర్ లాల్ లాహోటి, రీజియన్ చైర్ పర్సన్ లయన్ గుర్రాల చక్రాధర్, జోన్ చైర్ పర్సన్ లయన్ జాడి తిరుపతి, 320జి జిల్లా కాబినెట్ సభ్యుడు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్, క్లబ్ కార్యదర్శి లయన్ కప్స ప్రతాప్ సింగ్, కోశాధికారి లయన్ సౌడం శ్రీనివాస్, సభ్యులు లయన్ సౌడం సంతోష్, లయన్ ఎన్నాం సతీష్, సామాజిక కార్యకర్తలు నిమ్మల విశాల, ముత్యాల శ్రావణి, కొమ్మేర నవీన్, రావుల మధుకర్, కోడిపెళ్లి బాణయ్య, అమాన్,మోర్ల మదూకర్, పి హెచ్ సి సిబ్బంది బి. బాలు హెచ్ ఈ ఓ, డి. మహేందర్ యం ఎల్ హెచ్ పి,ఆశా సబ్బంది కె. లావణ్య, డి రాధ, కె బాలమణి,యం. కవిత తదితరులు పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: