Thursday, 30 July 2026 12:22:39 AM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

బెల్లంపల్లిలో ఘనంగా పంచముఖి శివాంజనేయ స్వామి విగ్రహ పునరుద్ధరణ: పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్

Date : 11 May 2026 04:58 PM Views : 956

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి మండలంలోని కన్నాల ప్రాంతంలో వెలసిన శ్రీ పంచముఖి శివాంజనేయ స్వామి విగ్రహ పునరుద్ధరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కన్నాల ప్రాంతంలోని స్వామివారి విగ్రహం రంగులు వెలసిపోవడంతో, ఆగమ శాస్త్ర నిపుణుల సూచనల మేరకు పునరుద్ధరణ పనులు చేపట్టారు. పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శివాంజనేయ కమిటీ సభ్యులు మరియు దాతల సహకారంతో విగ్రహానికి నూతనంగా రంగులు వేయించి, ఈ పునరుద్ధరణ మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ..భక్తి భావం సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలకు మానసిక ప్రశాంతతను, ఆత్మశాంతిని చేకూరుస్తాయి. నియోజకవర్గ ప్రజలందరిపై ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు, కన్నాల సర్పంచ్ నాతరి మల్లమ్మ, కమిటీ అధ్యక్షులు నర్సింగమ్, ఉపాధ్యక్షులు ఢీకొండ రాజలింగం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి నాతరి స్వామి, సంయుక్త కార్యదర్శి నెల్లి రమేష్, కార్యదర్శులు నూనె ప్రభాకర్, కటకం సతీష్, సాంబశివ రావు పాల్గొన్నారు.అలాగే కౌన్సిలర్లు ఢీకొండ పద్మ, నిచ్చకోల వంశీ, చింతల వసంత, నాయకులు కంకటి శ్రీనివాస్, గెల్లి రాజలింగు, నెల్లి సమ్మయ్య, సుద్దాల శ్రీనివాస్, సమ్మిరెడ్డి, ఎనగందుల సుధాకర్, తిరుపతి, రాజేష్, భూమిదాత శంకరయ్యతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :