వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఇస్గామ్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు ఎమ్మెల్సీ దండే విఠల్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ గౌడ సంఘం ఐక్యత, సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్సీని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ అగ్గిల సంగీత, గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం