Friday, 11 September 2026 02:47:57 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఆర్కే-1 బైపాస్ రోడ్డుపై చెత్తతో వాహనదారుల ఇబ్బందులు

Date : 24 August 2026 01:13 PM Views : 186

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రామకృష్ణాపూర్ బైపాస్‌ రోడ్డులోని డంప్‌యార్డ్‌ నుంచి వ్యర్థాలు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంప్‌యార్డ్‌లో చెత్తను సక్రమంగా నిర్వహించి, బయటకు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.డంప్‌యార్డ్‌లో ఉండాల్సిన వ్యర్థాలు రోడ్డుపైకి ఎందుకు వస్తున్నాయి? చెత్తను సక్రమంగా నిల్వ చేసే ఏర్పాట్లు లేవా? వర్షం వచ్చిన ప్రతిసారీ వ్యర్థాలు రోడ్డుపైకి కొట్టుకురావడం అధికారుల దృష్టికి రావడం లేదా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.రోడ్డుపై చెత్త పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దుర్వాసన, అపరిశుభ్రతతో పాటు పందులు, ఇతర జంతువులు రోడ్డుపై సంచరిస్తుండటంతో ప్రమాదాల ప్రమాదం కూడా నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డంప్‌యార్డ్‌ను సక్రమంగా నిర్వహించి, వ్యర్థాలు రోడ్డుపైకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :