వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బెన: శనివారం రోజున ఉద్యోగులకు నివాస సౌకర్యాల కల్పనలో భాగంగా బెల్లంపల్లి ఏరియా గోలేటి లోని జనరల్ మేనేజర్ కార్యాలయం లో క్వార్టర్ ల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఓ టు జి ఎం కె.రాజమల్లు మాట్లాడుతూ..కౌన్సిలింగ్ లో ఉద్యోగుల సీనియారిటీ, అర్హతలు అందుబాటులో ఉన్న క్వార్టర్స్ వివరాలు పరిగణలోకి తీసుకుని పారదర్శక విధానంలో సాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఈ సివిల్ ఎస్.శ్రీధర్, సీనియర్ పర్సనల్ అధికారి ఎం.శ్రీనివాస్, క్వార్టర్స్ సెక్షన్ ఇంచార్జ్ ఆర్. స్రవంతి ఎస్ అండ్ పిసి సెక్యూరిటీ గార్డ్ మంగిలాల్ పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం