వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : పోలీసు శాఖలో అంకితభావంతో విధి నిర్వహణ చేస్తూ, విశేష సేవలందించిన మంచిర్యాల సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సి.సి.ఎస్) సబ్ ఇన్స్పెక్టర్ దుర్గం లలితకు 'ఉత్తమ సేవా పతకం' లభించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో.పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆమెకు ఈ పతకాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.వివిధ దొంగతనం కేసుల్లో నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంతో పాటు, చోరీకి గురైన సొత్తును రికవరీ చేయడంలో లలిత కీలక పాత్ర పోషించారు. ఆమె నిబద్ధతను గుర్తిస్తూ సీపీ ఈ పురస్కారాన్ని అందించారు. కాగా, ఆమె గతంలో 2015లో కూడా సేవా పతకాన్ని అందుకోవడం విశేషం.ఈ సందర్భంగా ఎస్ఐ దుర్గం లలిత మాట్లాడుతూ.తన సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినందుకు సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ, ఏసీపీ, సీఐలతో పాటు తోటి ఉన్నతాధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత అంకితభావంతో విధులు నిర్వహిస్తానని ఆమె పేర్కొన్నారు.
Admin
వాస్తవ గమ్యం