Sunday, 13 September 2026 07:41:06 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కిష్టంపేట ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నేత దుర్గం అశోక్..

Date : 23 May 2026 03:13 PM Views : 921

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు మండల పరిధిలోని కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చెన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి దుర్గం అశోక్ సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏ ఓ) యామినితో ఫోన్ ద్వారా మాట్లాడి, కొనుగోళ్లలో అలసత్వాన్ని వీడి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ... కొనుగోలు కేంద్రాలకు లారీలు రావాలంటే 5000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, అలాగే అన్ లోడింగ్ కోసం బస్తాకు రూ. 15 నుండి రూ. 20 (క్వింటాలుకు సుమారు రూ. 50) వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, తేమ పేరుతో బస్తాకు 2 నుండి 5 కిలోల వరకు తరుగు (కటింగ్) విధిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చెన్నూరు మార్కెట్ యార్డ్ గోదాముకు వెళ్లిన ఆయన.ఎలాంటి తరుగు లేకుండా, తక్షణమే అన్ లోడింగ్ ప్రక్రియను పూర్తి చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని పై అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ చెన్నూరు మండల అధ్యక్షులు బుర్ర రాజశేఖర్ గౌడ్, 18వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణ, మాజీ పట్టణ అధ్యక్షులు జాడి తిరుపతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆలం బాపు, పట్టణ ప్రధాన కార్యదర్శి కాయిత వెంకటేష్, సీనియర్ నాయకులు యువరాజ్, రాజేశ్ చింతల తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :