Monday, 14 September 2026 10:01:54 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

విద్యార్థులకు మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు – హుజూరాబాద్ ఏసీపీ మాధవి

Date : 19 June 2026 10:56 PM Views : 196

వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. పట్టణ పరిధిలోని పలు కిరాణా దుకాణాలు, పాన్ షాపులు మరియు ఇతర వ్యాపార సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాల విక్రయాలపై పరిశీలన చేపట్టారు.ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ, విద్యార్థులకు లేదా యువతకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తించిన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిత్యం నిఘా ఉంచాలని, పాఠశాలలు మరియు కళాశాలల యాజమాన్యాలు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల నిర్మూలనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిషేధిత పదార్థాల విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.

S PRADEEP

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: