వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి దుర్గం ప్రవీణ్, డక్కలి సంఘం జిల్లా అధ్యక్షుడు జడల శంకర్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది యువకులు, మహిళలు ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన వారు మాట్లాడుతూ పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో దళితులకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని వారు విమర్శించారు.కార్యక్రమంలో మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యామ్‌రావు, సిర్పూర్ వార్డు సభ్యుడు ముక్రం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం