Saturday, 12 September 2026 09:03:27 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

తిర్యాని పీహెచ్‌సీని సందర్శించిన డివైడీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగేందర్

పోషకాహార లోపం, రక్తహీనత, వర్షాకాల వ్యాధుల నివారణ చర్యలపై సమీక్ష

Date : 08 July 2026 05:53 AM Views : 125

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఈరోజు డివిజనల్ డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ నాగేందర్ సందర్శించారు.ఈ సందర్భంగా వైద్యశాలలో నిర్వహిస్తున్న అన్ని రికార్డులను పరిశీలించి, ఆరోగ్య సేవల అమలు తీరును సమీక్షించారు. అలాగే ఆశా కార్యకర్తలు, వైద్యశాల సిబ్బందితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.పిల్లల్లో పోషకాహార లోపం, గర్భిణీలలో రక్తహీనత, నవజాత శిశువులకు తల్లిపాల ప్రాధాన్యత, గర్భిణీల హైరిస్క్ కేసులు, దీర్ఘకాలిక వ్యాధులు, క్షయవ్యాధి, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి వర్షాకాల వ్యాధుల నివారణ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే డ్రై డే కార్యక్రమాల నిర్వహణపై కూడా ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ, ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారి డాక్టర్ కౌటిల్య, హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ శ్రీవాణి, డివిజనల్ సబ్ యూనిట్ అధికారి శ్యాంలాల్, సబ్ యూనిట్ అధికారి నైతం శ్రీనివాస్, పర్యవేక్షకురాలు రత్నమాల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ డేటా ఎంట్రీ ఆపరేటర్ శివ, పీహెచ్‌సీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :