Saturday, 12 September 2026 04:36:01 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉదృతం

23న అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్.. 24న రోడ్ల దిగ్బంధం.. 25న ఛలో హైదరాబాద్

Date : 20 August 2026 08:59 PM Views : 96

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ గౌరవాధ్యక్షుడు గాజుల ముఖేష్‌ గౌడ్‌ హెచ్చరించారు.తెలంగాణ ఆటో యూనియన్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు.ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న ఈ ఆందోళనకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల కార్మిక విప్లవ సంఘాలు, ఆటో కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.అనంతరం 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దిగ్బంధం చేపట్టి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని. పేర్కొన్నారు.అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే 25వ తేదీన ‘చలో హైదరాబాద్‌–చలో ప్రజాభవన్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గాజుల ముఖేష్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.పేద,మధ్యతరగతి ఆటో కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.ఈ సమావేశంలో వివిధ ఆటో సంఘాల నాయకులు పాల్గొన్నారు.

NERELLA ANUSHA GOUD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :