వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి కార్మికుల సమస్యలు, హక్కులపై నిర్వహిస్తున్న ‘సింగరేణి కార్మిక గర్జన’ భారీ బహిరంగ సభ ఈ నెల 14వ తేదీ బుధవారం రామగుండంలో నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభకు సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు, సంస్థ భవిష్యత్తు, కార్మికుల హక్కులకు సంబంధించిన అంశాలపై సభలో చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం