వాస్తవ గమ్యం / తెలంగాణ / హైద్రాబాద్ : హైదరాబాద్: దసరా సెలవుల్లో హైదరాబాద్ నుంచి స్వస్థ లాలకు వెళ్లే ప్రయాణికుల కోసం TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. హాస్టళ్లలో 30 మంది ప్రయాణికులు ఉంటే ప్రత్యేక బస్సును బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. బుక్ చేసిన వారికి బస్సును నేరుగా వారి వద్దకే పంపిస్తామని అధికారులు తెలిపారు.సాధారణ ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, భద్రాచలం, ఖమ్మం తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు బుక్ చేసుకోవచ్చు.బుకింగ్ కోసం 9959226160 నంబర్‌కు సంప్రదించాలని TGSRTC అధికారులు సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం