Friday, 11 September 2026 01:46:42 PM
# జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు # మందమర్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు.

స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం

Date : 08 September 2026 05:00 PM Views : 125

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు ఆవుల సాగర్, పిట్టల సుధాకర్ ఆధ్వర్యంలో భారీగా చేరికల కార్యక్రమం జరిగింది. పెద్దపల్లి, ఆదిలాబాద్ కో-ఆర్డినేటర్ చుంచు రాజకిరణ్, పెద్దపల్లి కో-ఆర్డినేటర్ మంథని సంపత్ సమక్షంలో మందమర్రి ప్రాంతానికి చెందిన రాసమల్ల రాజేష్‌తో పాటు దాదాపు 50 మంది యువకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. నూతనంగా పార్టీలోకి చేరిన వారికి నేతలు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా చుంచు రాజకిరణ్ మాట్లాడుతూ.జనసేన పార్టీ ఎల్లప్పుడూ యువతకే అగ్రతాంబూలం ఇస్తుందని స్పష్టం చేశారు. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని, ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే శక్తి జనసేనకు మాత్రమే ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో:ముఖ్య నేతలు: జిల్లా నాయకులు నల్లతిగల మహేష్, ఆవునూరి రమేష్, మల్లంపెల్లి విష్ణు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.పార్టీలో చేరిన ప్రముఖులు: మర్రి శ్రవణ్, మర్రి కృష్ణ, కళ్యాణ్, కుమ్మరి సూర్యచంద్ర, వినోద్, వైష్ణవ తదితర యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: