Sunday, 13 September 2026 07:41:21 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం

Date : 29 July 2026 06:29 PM Views : 283

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ బుధవారం వివిధ డివిజన్లలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఉప్పొంగుతున్న నాళాలు, లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.39వ డివిజన్ బృందావన్ కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలో వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిన చెత్తాచెదారం, పైపులను జేసీబీ సాయంతో తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించారు. అధిక వర్షపాతం దృష్ట్యా అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని మేయర్ ఆదేశించారు.నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. వర్షాల ప్రభావంతో అత్యవసర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.అలాగే, అవసరం లేని సమయంలో ఉప్పొంగుతున్న నాళాలు, వాగులు, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని మేయర్ దర్ని మధుకర్ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: