వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: రాష్ట్రవ్యాప్తంగా డీసీస్ సర్వేలో విధులు నిర్వహించిన వాలంటీర్లకు ఇప్పటి వరకు పారితోషికం అందకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అప్పగించిన సర్వే బాధ్యతలను క్షేత్రస్థాయిలో పూర్తి చేసినప్పటికీ, నెలలు గడుస్తున్నా చెల్లింపులు జరగలేదని వాలంటీర్లు చెబుతున్నారు.సర్వే నిర్వహణ కోసం ప్రయాణ ఖర్చులు, ఇతర అవసరాలకు తమ సొంత డబ్బును వెచ్చించాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. చేసిన పనికి తగిన పారితోషికాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను వాలంటీర్లు కోరుతున్నారు.ఈ అంశంపై అధికారులు స్పందించి, పెండింగ్‌లో ఉన్న పారితోషికాలను త్వరితగతిన విడుదల చేసి వేలాది మంది డీసీస్ సర్వే వాలంటీర్లకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Reporter
వాస్తవ గమ్యం