వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో వైద్యులు అత్యవసరంగా స్పందించి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఓ శిశువును కాపాడారు. శిశువు పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు వెంటనే ఆపరేషన్ నిర్వహించి సురక్షిత ప్రసవం చేశారు.క్లిష్ట పరిస్థితుల్లోనూ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి తల్లి, శిశువుకు అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం శిశువును వైద్యుల పర్యవేక్షణలో ఉంచి అవసరమైన వైద్యం అందిస్తున్నారు.అత్యవసర సమయంలో వైద్య బృందం వేగంగా స్పందించి శిశువును కాపాడటంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
Reporter
వాస్తవ గమ్యం