Saturday, 12 September 2026 03:55:58 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ

Date : 06 September 2026 12:22 PM Views : 61

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు జిల్లా, మండల కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఓబీసీ విభాగం జిల్లా పరిశీలకుడు ముత్తినేని రవీందర్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎమ్మెల్సీ దండే విఠల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముత్తినేని రవీందర్ మాట్లాడుతూ పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారికి కమిటీల్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ఓబీసీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ ఓబీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకులు, కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా, మండల స్థాయిలో ఓబీసీ విభాగం పదవులకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా కమిటీల నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఓబీసీ విభాగం ఆశావహులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: