వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా, జైనూర్ మండలం లో విధులు నిర్వహిస్తున్న శ్రీ మెస్రం మనోహర్ ఈరోజు ఉద్యోగ విరమణ పొందారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా *అసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి * పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయునిగా ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన మెస్రం మనోహర్ గారి సేవలు చిరస్మరణీయం. వారి అంకితభావం, క్రమశిక్షణ యువ ఉపాధ్యాయులకు ఆదర్శం అని కొనియాడారు.మనోహర్ ki శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. వారి భవిష్యత్ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జైనూర్ మండల ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం