వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : అప్రకటిత విద్యుత్ కోతలు, లో-ఓల్టేజీ సమస్యతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రైతులు కన్నెపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఆశన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ర మంలో జడ్పీటీసీల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు,న్యాయ వాది కొయ్యల ఏమాజి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల నిత్యం మోటార్లు కాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రోజుకు 12 గంటల నిరంతర విద్యుత్ అందించాలని, ఎండిన పంటలకు ఎకరాకు ₹25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా హైదరాబాద్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ఈ నిరసనలో బీజేపీ నాయకులు బొల్లెడ్ల కేశవరెడ్డి, రామయ్య యాదవ్, గోవర్ధన్, ఆకుల శంకర్, యుగంధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం