Saturday, 12 September 2026 09:01:48 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

అంగన్వాడీ కేంద్రంలో టీచర్ గైర్హాజరు

బొట్టుపెల్లి సర్పంచ్ కృష్ణవేణి ఆకస్మిక తనిఖీ

Date : 09 April 2026 01:38 PM Views : 296

వాస్తవ గమ్యం / తెలంగాణ / : కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట్ మండలం దరోగపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో విధుల్లో నిర్లక్ష్యం బయటపడింది. ఉదయం 11:10 గంటలకు సర్పంచ్ బొట్టుపెల్లి కృష్ణవేణి పరిశీలనకు వెళ్లగా, టీచర్ అందుబాటులో లేకుండా కేంద్రంలో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం, ఆ సమయంలో టీచర్ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు లేకపోవడం పట్ల సర్పంచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.అంగన్వాడీ కేంద్రాలు చిన్నపిల్లలకు పోషకాహారం, ప్రాథమిక విద్య అందించాల్సిన కీలక కేంద్రాలుగా ఉండగా, ఈ తరహా నిర్లక్ష్యం పిల్లల అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :