Sunday, 13 September 2026 07:33:50 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఆరోగ్య పరిరక్షణపై అవగాహన సదస్సు

Date : 12 May 2026 10:10 PM Views : 929

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్‌ మండల కేంద్రంలోని ఎస్‌టీపీపీలో మంగళవారం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా వైద్య ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్. అనిత మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే డిహైడ్రేషన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు. బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కోరుతూ.. 14 ఏళ్లు నిండిన వారికి గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ఇప్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయుష్ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం యొక్క విశిష్టతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ వీటిని జీవనశైలిలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. ముస్తాఫా, డా. సింధూర, డా. పద్మజ, సీహెచ్‌ఓ రాజిరెడ్డితో పాటు పవర్‌ ప్లాంట్‌ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :