వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఉండాల్సిన రక్షణ కంచె పూర్తిగా తొలగిపోవడంతో పాటు, చెట్ల పొదలు, అడవి తీగలు ట్రాన్స్‌ఫార్మర్‌పైకి విస్తరించి ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని వారు చెబుతున్నారు. కాలనీలో చిన్నారులు, వృద్ధులు, ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలోనే ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లో పెరిగిన పొదలు, తీగలను తొలగించి, బలమైన రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా ముందస్తు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Reporter
వాస్తవ గమ్యం