Friday, 11 September 2026 02:47:34 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

హరిహర దేవస్థానంలో ఘనంగా శ్రావణమాసం మొదటి శుక్రవారం సంతోషి మాత పూజలు

Date : 14 August 2026 12:02 PM Views : 189

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని ప్రముఖ శ్రీ హరిహర దేవస్థానంలో పవిత్ర శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ సంతోషి మాత పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది.శుక్రవారం ఉదయం అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ సంతోషి మాతకు విశేష పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అనంతరం మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం సమర్పించి, కుంకుమార్చనలు, దీపారాధనలు నిర్వహించారు.శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో స్థానిక భక్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో హరిహర దేవస్థాన ‘జై సంతోషి మాత’ నామస్మరణతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, పూజా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. మాతా స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: