Monday, 14 September 2026 10:56:44 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి:

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

Date : 29 July 2026 08:04 PM Views : 362

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్‌వోలు తో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటైజేషన్ ప్రక్రియను బీఎల్‌వో సూపర్వైజర్లు, ఏఈఆర్‌వోలు, ఈఆర్‌వోలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడంతో పాటు, అనర్హుల పేర్ల తొలగింపు, ఓటరు వివరాల సవరణ వంటి ప్రక్రియలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో ప్రతి కేంద్రంలో 1,200 మందికి మించకుండా ఓటర్ల సంఖ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, వాటి వివరాలను డాక్యుమెంటేషన్ చేయాలని, అలాగే ఏఎస్‌డీ జాబితా సిద్ధం చేసిన తర్వాత సంబంధిత బూత్ స్థాయి ఏజెంట్ సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 81 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయ్యిందని, నిర్ణీత గడువులోగా 100 శాతం పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత సహకారంతో ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలయత్ అలీ, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :