Saturday, 12 September 2026 04:34:32 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

వాహన తనిఖీలలో అక్రమ మద్యం పట్టివేత.

Date : 01 August 2026 08:32 PM Views : 103

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎ.రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు,రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి,తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :