Sunday, 13 September 2026 08:41:24 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఓటరు మ్యాపింగ్ వేగవంతం చేయాలి

కలెక్టర్ హరిత సమీక్ష

Date : 12 May 2026 07:57 PM Views : 683

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కె.హరిత సిర్పూర్ నియోజకవర్గ మండలాల తహసిల్దార్లు, ఏపీఎంలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మ్యాపింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పంచాయతీ కార్యదర్శులు బూత్ స్థాయి అధికారులకు పూర్తి సహకారం అందించాలని నిర్దేశించారు.అనంతరం వరి ధాన్యం కొనుగోలు, గోనె సంచుల లభ్యత, భూభారతి దరఖాస్తుల పరిశీలన, ధ్రువపత్రాల జారీ, పెండింగ్ అంశాలపై తహసిల్దార్లతో సమీక్ష జరిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని, అకాల వర్షాల నేపథ్యంలో గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, ధ్రువపత్రాలు నిర్ణీత గడువులోగా జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :