వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : చెన్నూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 20-07-2026 (సోమవారం) మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం వాల్ పోస్టర్‌ను బుధవారం చెన్నూరు పట్టణ సీఐ బన్సిలాల్, ఎస్సై రాజశేఖర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని కొనియాడారు. ముఖ్యంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం ద్వారా ప్రజలు తమ కంటి ఆరోగ్యాన్ని పరీక్షించుకొని అవసరమైన చికిత్స పొందేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు. చెన్నూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే చెన్నూర్ లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో జోన్ చైర్‌పర్సన్ లయన్ జాడి తిరుపతి, ప్రెసిడెంట్ లయన్ నిమ్మల సాగర్, సెక్రటరీ లయన్ కప్స ప్రతాప్ సింగ్, లయన్ మదాసు కిష్టయ్య, లయన్ కట్ట సదానందం, లయన్ కట్ట కృష్ణమూర్తి, లయన్ జక్కుల సత్యనారాయణ,ప్రహ్లాద రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం