Thursday, 29 October 2026 12:44:57 AM
# ఆర్టీఐ చట్టంపై ప్రజలకు అవగాహన అవసరం: యుఎఫ్ ఆర్టీఐ # అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన # మణికంఠుని పల్లకి సేవలో పాల్గొన్న అజ్మీర శ్యామ్ నాయక్ # ఎంఏ రఫీక్‌ను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు # రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి

సింగరేణి లాభాలు వెంటనే ప్రకటించాలి: టీబీజికేఎస్

Date : 13 August 2026 12:52 PM Views : 196

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి సంస్థకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలని TBGKS బెల్లంపల్లి ఏరియా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం గోలేటిలోని TBGKS కార్యాలయంలో వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25లో సింగరేణి లాభాల్లో అభివృద్ధి నిధుల పేరుతో భారీ మొత్తాన్ని పక్కన పెట్టి కార్మికులకు తక్కువ వాటా చెల్లించారని, ఈసారి ఎలాంటి మినహాయింపులు లేకుండా మొత్తం లాభాల్లో 40 శాతం కార్మికులకు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.25 వేల చొప్పున ఏకమొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.అలాగే 12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి మెడికల్ బోర్డు నిర్వహించి ఆన్‌ఫిట్ చేయాలని కోరారు. హైదరాబాద్‌లో సింగరేణి ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసి కార్మికులు, మాజీ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షలను వెంటనే నిర్వహించాలని తీర్మానించారు.సమావేశంలో కేంద్ర, ఏరియా కమిటీ నాయకులు ధరావత్ మంగీలాల్, ఆనుముల సత్యనారాయణ, సంపతి తిరుపతి, ఓరం కిరణ్, కైత స్వామి, వంగ మహేందర్, కోగిలాల రవీందర్, సంపత్ రావు, అనీష్, సంగీ ప్రశాంత్, గుంట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :