Thursday, 30 July 2026 12:42:00 AM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

కోటపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలి

నిర్లక్ష్యం వీడకుంటే కలెక్టరేట్ ముట్టడి: తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం హెచ్చరిక

Date : 19 May 2026 05:20 PM Views : 660

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కోటపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజల కోసం వెంటనే త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ రాఘవేంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా దంచి కొడుతున్నప్పటికీ, నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే తహశీల్దార్ కార్యాలయంలో కనీసం త్రాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడం తహశీల్దార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చాలని గత ఏడాది కూడా వినతిపత్రం ఇచ్చాం. అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ అధికారులు కాలయాపన చేస్తూ దాటవేస్తున్నారు.​కార్యాలయంలో నీటి సదుపాయం లేకపోవడంతో దూరాభారం నుండి వచ్చే రైతులు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాహం తీర్చుకోవడానికి బయట కిరాణా షాపుల్లో డబ్బులు పెట్టి నీళ్లు కొనాల్సి వస్తోందని, ఒకవేళ నీళ్ల కోసం బయటకు వెళ్తే లోపల అధికారి ఎప్పుడు పిలుస్తారో తెలియక ప్రజలు దాహాన్ని భరిస్తూ అక్కడే వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. నీరు సరిగ్గా అందక పలువురు డిహైడ్రేషన్‌కు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తహశీల్దార్ రాఘవేంద్రరావు స్పందించి, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే త్రాగునీటి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జిమిడే రాజమల్లు, జిమిడే లింగయ్య, కన్న సత్యన్న, పోగుల గంగన్న, దామోదర్, జిమెడి అంజన్న, పాటి మీద సంపత్, కొండ సమ్మయ్య, రావుల జీవన్, ముంజం పోషమల్లు, కొండగుర్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: