Monday, 14 September 2026 10:10:34 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రి జీఎం కార్యాలయం వద్ద అధికారుల సంఘం రెండో రోజు రిలే నిరాహార దీక్ష

Date : 30 June 2026 07:28 PM Views : 334

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : మందమర్రి, జూన్ 30: సింగరేణి అధికారుల సంఘం పిలుపు మేరకు మందమర్రి ఏరియా అధికారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జీఎం కార్యాలయం ఎదుట మంగళవారం రెండో రోజు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా అధికారులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని తమ డిమాండ్ల సాధన కోసం నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మందమర్రి ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు ఎస్. రమేష్ మాట్లాడుతూ, రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌పీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలని, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, అధికారుల పదోన్నతులు, బదిలీల్లో పారదర్శకత కల్పించడంతో పాటు సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సింగరేణి అధికారులు సంస్థను తమ సొంత సంస్థగా భావించి సమయాభావాన్ని లెక్కచేయకుండా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ, నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమని ఆయన అన్నారు. గత నెల రోజులుగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ స్పందించకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు..ఇలాంటి పరిస్థితి కొనసాగితే సంస్థ మనుగడపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వెంటనే యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి అధికారుల న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకుని పీఆర్‌పీ బకాయిల చెల్లింపు, పే అప్‌గ్రేడేషన్ అమలుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. డిమాండ్ల పరిష్కారంలో మరింత జాప్యం జరిగితే నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయడంతో పాటు సమ్మెకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి బసవరాజు, ఉపాధ్యక్షుడు వర్ధన్, డాక్టర్ మధు, సంయుక్త కార్యదర్శి రవి, ఖజాంచి సరిత, ఎం. సంతోష్, శ్యామ్, రాజ్‌కుమార్, మహబూబ్ ఖాన్‌తో పాటు మందమర్రి ఏరియాకు చెందిన సీనియర్, జూనియర్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :