వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి ఏరియా వర్క్‌షాప్‌లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం వర్క్‌షాప్ డివిజన్ అధికారి సురేష్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పిట్ కార్యదర్శి శర్మ మాట్లాడుతూ వర్క్‌షాప్‌లో టెక్నీషియన్ల కొరత కారణంగా పనులు సకాలంలో పూర్తి కావడం లేదని తెలిపారు. టూల్స్, మిషనరీల మరమ్మతులు చేపట్టి ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగుల కోసం ఉన్న వాష్‌రూమ్‌లను తక్షణమే ఆధునికీకరించాలని డిమాండ్ చేశారు.ఇటీవల వీచిన గాలిదుమారం వల్ల విద్యుత్ స్తంభాలు విరిగి, తీగలు తెగిపోవడంతో కాలనీల్లో వీధి దీపాలు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కొత్త స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు దెబ్బతిన్న సర్వీస్ కేబుల్స్‌ను మార్చాలని యాజమాన్యాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఏరియా నాయకులు టేకుమట్ల తిరుపతి, పెద్దపల్లి బానయ్య, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్, సేఫ్టీ మైన్ కమిటీ సభ్యుడు ములకలపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం వర్క్‌షాప్ డివిజన్ అధికారి సురేష్‌కు సమస్యల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ధర్నా కార్యక్రమంలో వర్క్‌షాప్ సేఫ్టీ కమిటీ, పిట్ కమిటీ సభ్యులు కొండ వెంకటేష్, సాధనవేని ప్రభాకర్, కన్నం వేణు, బైరి పోషాలు, పొన్నం శ్రీనివాస్, కె. రాజయ్య యాదవ్, రాంరెడ్డి, డ్రైవర్ కుమారస్వామి, కె. వెంకట్రావు, ఉరగొండ శ్రీకాంత్‌తో పాటు వర్క్‌షాప్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం