Sunday, 13 September 2026 07:55:18 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రాజకీయాలు కాదు.. రైతుల ప్రయోజనాలే ముఖ్యం

కన్నేపల్లి పంప్‌హౌస్ మోటార్లు ప్రారంభించి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాలి: రైతుల విజ్ఞప్తి

Date : 13 July 2026 01:40 PM Views : 157

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రాజకీయాలకు అతీతంగా రైతులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. పంటల సాగుపై తీవ్ర అనిశ్చితి నెలకొని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నది ద్వారా లక్షల క్యూసెక్కుల నీరు తెలంగాణ మీదుగా ప్రవహించి వినియోగం లేకుండా దిగువకు వెళ్లిపోతోందని తెలిపారు. ఈ నీటిని సద్వినియోగం చేసేందుకు కన్నేపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించి ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు ఇతర రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.కన్నేపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపడం వల్ల ఎలాంటి సాంకేతిక నష్టం జరగదని రిటైర్డ్ ఇంజనీర్లు ఇప్పటికే సూచించారని రైతులు తెలిపారు. అవసరమైతే తాము స్వయంగా అక్కడే ఉండి పంపింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి సిద్ధంగా ఉన్నామని వారు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రాజెక్టులను నింపడం వల్ల రాష్ట్రంలోని రైతులు,ప్రజలకు మేలు జరుగుతుందని, ఏ ప్రాజెక్టుకు లేదా ఎవరికీ మంచి పేరు వస్తుందన్నది ముఖ్యమేమీ కాదని, ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రాధాన్యం కావాలని రైతులు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల బాధ్యత రైతుల ప్రయోజనాలను కాపాడటమేనని, అందువల్ల ఆలస్యం చేయకుండా కన్నేపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు విజ్ఞప్తి చేశారు.

GADDAM SHASHIKANTH

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: