వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరంభీమ్ ఆసిఫాబాద్ గుండి గ్రామపంచాయతీ,గుండి గ్రామంలో గత 20 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న బిర్జి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామ యువకులు సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. అక్టోబర్ 26, సోమవారం ఉదయం ఈ యాత్ర ప్రారంభం కానుంది గుండి నుంచి హైదరాబాద్ సెక్రటేరియట్ వరకు.ఈ యాత్రలో దుర్గం సురేష్, చందన్ ఖడే సంతోష్, జక్కుల వేణు, ధాన్పల్లి వినోద్, కోటా రాజు, రాస్పల్లి నాగయ్య, దేశబోయిన ప్రవీణ్, కోలే శ్రీకాంత్ పాల్గొననున్నారు.గుండి బిర్జి సమస్య పరిష్కారానికి గ్రామ ప్రజలంతా సహకరించి, యువతకు అండగా నిలవాలని నిర్వాహకులు కోరారు. సమస్య పరిష్కారం కోసం గ్రామమంతా ఐక్యంగా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
Reporter
వాస్తవ గమ్యం