Sunday, 13 September 2026 08:40:58 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే టాపర్స్

మంత్రి వివేక్ వెంకటస్వామి

Date : 27 May 2026 05:20 PM Views : 15661

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, అందుకు నిదర్శనమే పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు టాపర్లుగా నిలవడమేనని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటలోని శ్రీ కన్వెన్షన్ హాల్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని, విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై, టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ​ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ విద్యా రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న కట్టుబాటును వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 50 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశాం విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్'ను స్థాపించబోతున్నాం. చెన్నూరు పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు (స్పెషల్ ఫండ్స్) కేటాయించి కార్యాచరణ చేపడుతున్నo. విద్య కోసం ఎన్ని నిధులైనా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం, అధికారులు, ప్రజాప్రతినిధులు నిధుల కోసం నాతో ఫైట్ చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు రోడ్లు, డ్రైనేజీల వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టానని, ఇక నుంచి పూర్తి ఫోకస్ విద్య, వైద్య రంగాల పైనే ఉంటుందని స్పష్టం చేశారు. ​విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవలు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో విద్యా, సామాజిక రంగానికి అందిస్తున్న సేవలను మంత్రి గుర్తుచేశారు. మహిళల కోసం పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మించామని, పాఠశాలల్లో టీచర్ల కొరత తీర్చడం, బెంచీలు ఏర్పాటు చేయడం, తాగునీటి కోసం బోర్ వెల్స్ వేయించడం వంటి పనులు ట్రస్ట్ ద్వారా చేపట్టామని తెలిపారు. అలాగే చెన్నూరులో నిర్మిస్తున్న ఏటీసీ సెంటర్ ద్వారా విద్యార్థులకు నెలకు రూ.2,000 చొప్పున స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు.విద్య ప్రతి ఒక్కరి హక్కు. అది మనిషికి స్వేచ్ఛను, ఆలోచనా శక్తిని ఇస్తుంది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. విద్యార్థులంతా క్రమశిక్షణతో చదువుకుని, జీవితంలో ఒక లక్ష్యాన్ని (గోల్) నిర్దేశించుకుని, తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాలి. ఈ అభినందన సభలో డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రఘునాధరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి (డి ఈ ఓ) యాదయ్య, మండల విద్యాశాఖాధికారి (ఎం ఈ ఓ) రమేష్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :