వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో మంచిర్యాల జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు పతకాల పంట పండించారని జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.బంగారు పతకం విద్యార్థి అండర్ 61 కేజీల విభాగంలో మోక్షిత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.రజత పతకాలు సబ్ జూనియర్ బాయ్స్ అండర్ 35 కేజీల విభాగంలో దీమన్,సబ్ జూనియర్ గర్ల్స్ అండర్ 36 కేజీలు విభాగంలో విజ్ఞ శ్రీ వెండి పతకాలు సాధించారు. కాంస్య పతకాలు అండర్ 41 కేజీల విభాగంలో శ్రీవాస్తవ, జెస్విత్ కాంస్యాలు గెలుచుకున్నారు.అండర్ 36 కేజీల విభాగంలో దేవర్శిస్ కాంస్యం సాధించారు. బాలికల విభాగంలో ఆరాధ్య అండర్ 33 కేజీలు, హ్రీధ్య అండర్ 36 కేజీలు,అవంతిక అండర్ 41 కేజీలు కాంస్య పతకాలు గెలుచుకున్నారు.రాష్ట్ర స్థాయిలో జిల్లా కీర్తిని చాటిన విద్యార్థులను మంచిర్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు అక్కల రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మెయిన్, రంజిత్ తదితరులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం