Sunday, 13 September 2026 07:32:22 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్ సీతారాంపల్లి జెడ్పీ హైస్కూల్ ఆకస్మిక తనిఖీ ​మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆదేశం

Date : 09 April 2026 04:59 PM Views : 359

వాస్తవ గమ్యం / తెలంగాణ / : ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం నస్పూర్ మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ​ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, పరిసరాలు, మరియు మూత్రశాలలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ​ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ, విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ​ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో, సృజనాత్మకంగా బోధించాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని, మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారాన్ని నిర్ణీత సమయానికి అందించాలని స్పష్టం చేశారు.పాఠశాల భవనాల్లో ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే గుర్తించి, యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పిల్లలకు వివరించాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :